బలగం టివి, , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని శివారులో వేములవాడ రహదారిలో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం మట్టినీ నిల్వ చేసిన విషయం తెలిసినదే. వ్యవసాయ భూమిలో నిల్వ చేసిన అక్రమ మట్టిని పరిశీలించిన మైనింగ్ అధికారి ఏడి రఘుబాబు. భూమికి సంబంధించిన యజమానిని పిలిపించుకొని భూమి లీజుకు తీసుకున్న పత్రాలను సరైనవా కాద అని పరిశీలించారు. అనంతరం మట్టిని నిల్వ చేసిన యజమాని పత్రాలు తీసుకొని మైనింగ్ కార్యాలయానికి వచ్చి సరైన పత్రాలను చూపించాలని ఆదేశించారు. లేని యెడల చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మైనింగ్ అధికారి ఏడి రఘుబాబు వెంట బోయినిపల్లి మండల ఆర్.ఐ బాలయ్య తదితరులు ఉన్నారు.