ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అమాత్య…. అని అడ్డుకున్న గ్రామ యువకుడు
బలగం టీవీ ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే కార్యక్రమంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి ఆమాత్య అని గ్రామ యువకుడు ఏబీవీపీ నాయకుడు అక్కేమ్ నాగరాజు ఎమ్మెల్యే కవ్వం పల్లి ని ప్లకార్డ్ చూపిస్తూ ఆయన వాహనానికి అడ్డుపడి నిరసన వ్యక్తం చేసాడు. వాహనం దిగిన ఎమ్మెల్యే కవ్వం పల్లి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే పనులు జరగడం లేదని సమాధానం తెలిపి వెళ్లిపోయారు. అనంతరం అప్రమత్తమైన పోలీసులు యువకుడిని పక్కకు నెట్టి వెళ్లిపోయారు.
ఈ సందర్బంగా గ్రామ యువకుడు నాగరాజు మాట్లాడుతూ.. మండలంలో మొట్టమొదటి సారి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి గ్రామంలో ప్రధాన సమస్య ఐన అసంపూర్తిగా ఉన్న బిక్కావాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే సంవత్సర కాలం దాటిన పట్టించుకోవడం లేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు తప్ప ఆచరణలో నాయకులు ముందుండటం లేదని రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మండిపడ్డారు.
ఈ కార్యక్రమం లో గ్రామ యువకులు వొళ్ళాల మధు, ఉతకం వెంకటేష్, విన్ను, అల్లెపు కార్తీక్, అఖిల్, చొప్పరి నాగరాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

