విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి..

0
28

కోశాధికారిగా బాసన్ పెళ్లి శ్యామసుందర్ ఏకగ్రీవం

బలగం టీవీ, సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బి.వై. నగర్‌లో గల విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ (రి.నం 619/2003) కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి శనివారం నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. సొసైటీ భవనంలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించారు.

అధ్యక్ష పదవికి ముగ్గురి పోటీ సొసైటీ అధ్యక్ష పదవి కోసం తిప్పవరం రవీందర్, రేవోజు ప్రవీణ్ మరియు అలువాల ప్రసాదులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవికి కాంభోజ శ్రీనివాస్ మరియు గోకుల కొండ శ్రీధర్ పోటీలో ఉన్నారు. కోశాధికారి పదవికి బాసన్ పెళ్లి శ్యామసుందర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ పోటీలో లేకపోవడంతో, శ్యామసుందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.

ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ఎన్నికల అధికారి శ్రీరాముల వేణుగోపాల చారి పర్యవేక్షణలో నిర్వహించబడింది. సహాయకులుగా చెలిమెల రామస్వామి, విశ్వనాధుల చంద్రమౌళి వ్యవహరించారు. నామినేషన్ల స్వీకరణ అనంతరం ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. సొసైటీ నిబంధనల ప్రకారం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు మరియు కార్పెంటర్ వృత్తిదారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here