ఇల్లంతకుంట మండలంలో చాపకింద నీరులా పారుతున్న ఆన్లైన్ గేమ్స్ భూతం..

0
1791

ఈజీ మని ఆశతో నష్టపోతున్న యువత

పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

బలగం టీవీ, ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ భూతం చాపకింద నీరులా పాకుతుంది. మండలంలో యువకులతో పాటు పలువురు ఈజీ మనీ వస్తుందన్న ఆశతో బెట్టింగ్ లు పెట్టి నష్టపోతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. పలు గ్రామల్లో కొంతమంది యువత గేమ్స్ లో అదృష్టం తలిగి లక్షలాది రూపాయలు వచ్చి కొత్త కొత్త కార్లు, వాహనాలు కొనుగోలు చేస్తున్నారని చాలామంది ఈ విధంగా మండలంలో ధనవంతులు అయ్యారని తమకు కూడా అదృష్టం కలిసి వస్తుందన్న ఆశతో కొంతమంది యువకులు నిద్రహారాలు మని ఆన్లైన్ గేమ్స్ కు ఆకర్షతులు అవుతున్నారని బాహటంగానే అనుకుంటున్నారు. ఇక మండలంలో ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం మాత్రం తెలిసిన గానీ పట్టించుకోకుండా నిమ్మకు నిరెత్తన్నట్టు వ్యవహారిస్తున్నారు. ఏది ఏమైనా అదృష్టం కలిసి వచ్చి ఎలాంటి హాని కలగకుండా ఉంటే పర్లేదు కానీ పెద్ద మొత్తం లో బానిసలై తీవ్రంగా నష్టపోతే కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here