డిస్కౌంట్ చలాన్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…-ఎస్పీ అఖిల్ మహాజన్

0
177

బలగం టీవి…

ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది అని,ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఈ
ద్విచక్ర, త్రి చక్ర వాహనలకు 80శాతం, ఆర్టీసీ బస్సులు 90% శాతం,నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60% శాతం రాయితి ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ చాలన్ చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి అని,https://echallan.tspolice.gov.in/publicview/ తెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చ అని,లేదా ఫోన్ పే, పే టీం ఏం, గూగుల్ పే మీ సేవ,ఈ సేవ లో చెలించవచ్చు అని తెలిపారు.ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ చలానాల చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here