ఇంచార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజీ మార్గమే రాజ మార్గమని, సమాజంలోని తల్లిదండ్రుల యొక్క కుటుంబ కలహాల వల్ల పిల్లల యొక్క మానసిక ఎదుగుదలకు ఆటంకం కాకుండా ఉండాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు బి.పుష్పలత అన్నారు.
శనివారం జిల్లా కోర్టు సముదాయంలో రాజన్న సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ జిల్లా జడ్జి మాట్లాడుతూ.. కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారమవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. బార్ అసోసియేషన్ సభ్యులు లోక్ అదాలత్‌లో మరిన్ని కేసులను పరిష్కారానికి పంపేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల/ఇన్చార్జి కార్యదర్శి పి.లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి, వేములవాడ అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.
