-90 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది.. మళ్లీ సీఎం కేసీఆర్..
- కెసిఆర్ మాట.. సంక్షేమానికి బాట.
- బిజెపి,కాంగ్రెస్ మోసపూరిత హామీలను కార్యకర్తలు తిప్పి కొట్టండి..
- ఈనెల 10న కేటీఆర్ నామినేషన్…
సిరిసిల్ల న్యూస్:
తెలంగాణ ప్రజలు గులాబీ జెండాను,కెసిఆర్ ని, సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి మూడోసారి సీఎంను చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయిన పల్లి వినోద్ కుమార్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి నాప్స్కాబ్ చైర్మన్ రవీందర్ రావు ,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణరాక ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది’ అనేది ప్రజలతో నాయకులు, కార్యకర్తలు చర్చించాలని అన్నారు. కేసీఆర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిందనీ,తెలంగాణ రైతాంగానికి గుదిబండగా ఉన్న కరెంటు సమస్యకు కేసీఆర్ పరిష్కారం చూపించారనీ అన్నారు. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిని, రాత్రిపూట రైతులు కరెంటు పెట్టడానికి పొలాలకు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు అని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని అన్నారు. రైతు చనిపోతే, రైతు కుటుంబం ఆగం కావద్దని, వారం తిరగక ముందే రైతు కుటుంబానికి ఐదు లక్షల రైతు బీమా ఇస్తున్నామని అన్నారు. భూమిలేని ప్రతి కుటుంబానికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరుతో ప్రతి కుటుంబానికి ఐదు లక్షల బీమా సౌకర్యంతో తెలంగాణలో తెల్ల కార్డు ఉన్న 93లక్షల కుటుంబాలకు వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి తో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వస్తే ధరణి తీసివే స్తామనిచెబుతున్నారని, ధరణి తీయడం వల్ల గ్రామాల్లో పంచాయతీ పెట్టడానికి, పెత్తందారీ వ్యవస్థను ప్రవేశ పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అన్నారు.వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే విద్యుత్ చాలు అంటున్న రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలను ప్రజలకు వివరించాలని అన్నారు. నర్మల ఎగువ మానేరు మండు ఎండాకాలంలో మత్తడి దుంకిందని, మళ్లీ అధికారంలోకి వస్తే ఎగువ మానీరు పూడిక తీస్తామని, దీంతో ఈ ప్రాంతమంతా భూగర్భ జలాలు పుష్పలంగా ఉంటాయని అన్నారు.

నాప్స్కాబ్ చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతులకు కష్టాలు తగ్గినాయని, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కెసిఆర్ అని అన్నారు. సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రతి కుటుంబానికి అందుతున్నాయని, ప్రజలు బీ ఆర్ఎస్ వైపు ఉన్నారని, కాంగ్రెస్కు ఓటమి తప్పదని తెలిసి, దాడులను ప్రేరేపిస్తుందని అన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి బాధాకరమని, తెలంగాణలో హింసకు తావు లేదు అని అన్నారు. సంఘవిద్రోక శక్తుల చేతిలోకి కాంగ్రెస్ పగ్గాలు వెళ్లాయని, అధికారం కోసం వారు దాడులను ప్రేరేపిస్తున్నారని, ఇలాంటి దాడులకు భయపడు లేదని అన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడప కు తీసుకువెళ్లాలని అన్నారు. అన్ని రంగాల్లో సిరిసిల్లను అభివృద్ధి చేసిన కేటీఆర్ ను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈనెల 10న కేటీఆర్ నామినేషన్ వేయబోతున్నాడని, కార్యకర్తలు నాయకులు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, రాష్ట్ర సీనియర్ నాయకులు చీటీ నర్సింగరావు, ఎంపీపీ కరుణ, జడ్పిటిసి విజయ,జడ్పీ కో ఆప్షన్ హైమద్,ఎఏం సి చైర్మన్ హన్మంతరెడ్డి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, ఆర్బిఎస్ కోఆర్డినేటర్ రాజేందర్, బిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు లత, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పలు గ్రామాల టిఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.