భూ తగాధాల్లో తలదూర్చి బెదిరింపుకు పాల్పడుతూ,హత్యప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్,రిమాండ్ కి తరలింపు.

0
117

బలగం టివి, రాజన్న సిరిసిల్ల 

భూ తగాధాల్లో తలదూర్చి మద్యమవర్తితనం చేస్తూ డబ్బులు, భూమి డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ, ఈవ్వనందుకు రాజు అనే వ్యక్తి పై హత్యప్రయత్నం చేసిన రిపోర్టర్ రమణారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల టౌన్ డిఎస్పీ ఉదయ్ రెడ్డి బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

భూ తగాధాల్లో ,ఇతర విషయాల్లో ప్రజలను బేధరింపులకు పాల్పడిన రమణారెడ్డి పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో గతంలో నాలుగు కేసులు నమోదు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…
సిరిసిల్ల పట్టణం చంద్రంపేట కు చెందిన తుంగ రాజు తండ్రి: నర్సయ్య తన యొక్క భూమి సమస్య పరిష్కారణ గురించి రిపోర్టర్ గా పని చేస్తున్న చంద్రంపేట నివాసుడైన పాతూరి రమణారెడ్డి అనే వ్యక్తిని సంప్రదించగా,రమణారెడ్డి అనే వ్యక్తి ని భూసమస్యను నేను పరిష్కరిస్తా దానికి ఫలితంగా భూమి సెటిల్మెంట్ చేయడానికి మూడు లక్షల రూపాయలు, తాను సెటిల్మెంట్ చేసిన భూమి లో వంద గజాలు ఇవ్వాలని తుంగ రాజును బెదిరించగా రాజు భయపడి రమణారెడ్డికి రాజు ఒక లక్ష రూపాయలను ఇవ్వడం జరిగింది.కానీ రమణారెడ్డి రాజు భూసమస్య పరిస్కారం చేయకపోగా, తిరిగి మిగిలిన రెండు లక్షలు ఇవ్వాలని, వంద గజాల భూమి రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించినాడు.తుంగ రాజు తెధి:05-02-2024 వ రోజున సాయంత్రం,చంద్రంపేట నుండి వేములవాడకు వెళుతున్న సమాచారం తెలుసుకున్న పాతూరి రమణారెడ్డి అతనిని చంపాలనే ఉద్దేశ్యంతో తన ద్విచక్ర వాహనంతో రాజు ద్విచక్ర వాహనం వెనుక నుండి గుద్ధి, కులం పేరుతో తిట్టుకుంటూ, గొంతు పిసికి, రాజుపై హత్యయాయత్నం చేసినాడు. ఇట్టి విషయంలో తుంగ రాజు తేదీ: 05-02-2024 రోజున సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా రమణారెడ్డి కోసం గలించగా రమణారెడ్డి సిరిసిల్ల కోర్ట్ నందు లొంగి పొగ గౌరవ కోర్ట్ రమణారెడ్డి ని జ్యూడిషయల్ రిమాండ్ కి పంపినట్లు డిఎస్పీ తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి.
ప్రజలు భూ సమస్యల్లో కానీ ఇతర సమస్యల్లో మధ్యవర్తులని ఆశ్రయించి మోసపోవద్దని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ,సి.ఐ,డిఎస్పీ ల వద్ద కానీ,జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్భయంగా పిర్యాదు చేయాలని ఈసందర్భంగా డిఎస్పీ కోరారు. మధ్యవర్తితనం చెస్ట్ ప్రజలను బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం అని హెచ్చరించిన సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here