సిబ్బంది అభినందించిన ఎస్సై రమాకాంత్
బలగం టీవి , ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ బాలుడు శనివారం రోజు సాయంత్రం తప్పిపోగా పోలీసులు సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రులను గుర్తించి ఆ బాలుడిని తల్లి చెంతకు చేర్చారు. పోలీసుల విరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎస్.కె అయిషా బేగం కుమారుడు ఆనిఫ్ (3) అనే బాలుడు తప్పిపోయి అంబేద్కర్ కాలనీ వద్ద ఏడుస్తూ ఉండగా ఎరుపుల సతీష్ అనే హెల్పర్ ఆ బాలుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్,కానిస్టేబుల్ సతీష్,రమేష్,హోంగార్డ్ అశోక్ లు వెంటనే ఆ బాలుడి ఫోటో సోషల్ మీడియా( వాట్సాప్ )ద్వారా ప్రచూరించగా వెంటనే తల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు పూర్తి వివరాలు తెలిపి తన కుమారుని హక్కున చేర్చుకుంది.గంట వ్యవధిలోనే బాలుడిని గురించి ప్రత్యేక చొరవ తీసుకున్న పోలీస్ సిబ్బంది, ఎరుపుల సతీష్ ను ఎస్ఐ రమాకాంత్ అభినందించాడు.