బలగం టివి, రాజన్న సిరిసిల్ల
గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి
శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం మరియు శ్రీ మడెలేశ్వరా స్వామి దేవాలయం , శ్రీ రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం లను సందర్శించడం జరిగింది ….
ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ…
గౌరవ శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు ఈ నెల 9 వ తేదీన సిరిసిల్ల పట్టణంలో నిర్వహించనున్న శ్రీ గంగమ్మ తల్లి వారి జాతర, శ్రీ మడెలేశ్వర స్వామి వారి జాతర మరియు శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి వారి జాతర లను దృష్టిలో ఉంచుకొని ఆయా దేవాలయాలను మరియు దేవాలయల పరిసరాలను ఈ రోజు అధికారులతో కలసి పరిశీలించడం జరిగింది అన్నారు..
సిరిసిల్ల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుండి కొన్ని వేల మంది జనం ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ గంగమ్మ తల్లి వారి జాతర, శ్రీ మడలేశ్వర స్వామి జాతర శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి వారి జాతరలలో పాల్గొంటూ ఆ దేవుళ్ళ కృపకు పాత్రులు అవుతున్నారు..
ఆయా దేవాలయాల నిర్వాహకులు కుల సంఘాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కన్నుల పండగగా ఈ జాతరలను నిర్వహిస్తున్నందుకు వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు..
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాతరలకు వచ్చె భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ లైటింగ్ ఏర్పాటు మరియు పారిశుధ్య నిర్వహణ ,త్రాగు నీరు ఏర్పాటు వంటి తదితర చర్యలు చేపడుతూ శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం చుట్టూ ఉన్న ఇసుక మెటలను చదును చేసి శ్రీ మడేలేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్క పరిసరాలను చదును చేస్తూ, శ్రీరామప్ప రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం వెళ్లే దారి వెంట ముళ్లపోదలను తొలగిస్తూ రహదారినీ చదునుగా ఉండేలా చూసుకుంటూ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలవకుండా పురపాలక సంఘం ద్వారా భక్తులకు సేవలందిస్తామని అన్నారు ..
ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించి మంచి నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరగా పనులను పూర్తి చేయాల్సిందిగా సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ , వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ , కౌన్సిలర్ సభ్యులు అన్నారం శ్రీనివాస్ , తెలంగాణ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ , సిరిసిల్ల రజక సంఘం అధ్యక్షులు దండు శ్రీనివాస్ , సిరిసిల్ల గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప సత్యనారాయణ , సిరిసిల్ల నాయిని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చింతకుంట శ్రీనివాస్ , కుల సంఘాల నాయకులు , గంగపుత్ర సంఘం వారు, రజక సంఘం వారు నాయి బ్రాహ్మణ సంఘం వారు, పుర ప్రముఖులు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది భక్తులు ఉన్నారు..
