◆జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి
ఈ రోజు వేములవాడ నియోజక వర్గంలో వేములవాడ రూరల్ మండలం నూకల మర్రి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, జడ్పీ స్కూల్ లో డైనింగ్ హాల్ , ఓపెన్ జిమ్ భూమి పూజ, మహిళ సంఘం భవనం బాలెన్స్ వర్క్, వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభం, ఫంక్షన్ హాల్ భూమి పూజ, మార్కెట్ భూమి పూజ, చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభం, రైతు వేదిక ప్రారంభం, సనుగుల గ్రామంలో జడ్పీ స్కూల్ లో డైనింగ్ హాల్ ప్రారంభం, మూడపల్లి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభం, అంగన్ వాడి భవనం ప్రారంభం, కొనారావ్ పెట్ మండలం ధర్మారం గ్రామంలో ఎస్సీ హాస్టల్ లో డైనింగ్ హాల్ ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కెసిఆర్ గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి మన కెసిఆర్ గారు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు.
గత ప్రభుత్వం లో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందయన్నారు. ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడపిల్లల పెల్లిలకు కళ్యాణ లక్ష్మి, షాదిముబరాక్ ద్వారా ఒక లక్ష రూపాయలను అందివ్వడం జరిగిందన్నారు. కెసిఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, కాళేశ్వరంప్రాజెక్ట్ ద్వారా పంట పొలాలకు సాగు నీరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, 24 గంటల కరెంటు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలసిస్ కేంద్రాలు, పల్లె దవాఖానాలు, బస్తీదవాఖానలు, మహిళల రక్షణ కొరకు షి టీమ్స్, పల్లె ప్రగతి, హరితహారం, అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ లు ఇంకా చెప్పుకుంటూ పోతే మన కెసిఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలు ఎన్నో ఉన్నాయని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు మల్లేశం యాదవ్, బూర వజ్రవ్వా బాబు, చంద్రయ్య గౌడ్, లావణ్య రమేష్ గౌడ్, జడ్పీటిసి లు ఏష వాని తిరుపతి, మ్యకల రవి, నాగం కుమార్, సర్పంచులు, ఎంపీటీసీ లు, సెస్ డైరెక్టర్లు , పాక్స్ చైర్మన్లు, అధికారులు, పాల్గొన్నారు.