బలగం టివి, ,తంగళ్ళపల్లి
మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ మండలంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన సందర్భంగా అంగన్వాడి యూనియన్ నాయకులు కలిసి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేస్తు తమ గోడు వెల్లబోసుకున్నారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ప్రభుత్వ ఉద్యొగులుగ గుర్తించడం, 60సంవత్సరాలు నిండిన టీచర్ మరియు అయకి రెటైర్మె0ట్ కల్పించి టీచర్ కి 10 లక్షలు,ఆయాకి 5 లక్షలు రెటైర్మెంట్ బెన్ ఫిట్ ఇవ్వాలని నెలనెలా పెన్షన్ఇవ్వాలని ప్రతినెల పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.మే నెల వెసవి సెలవులతో పాటు ప్రతి నెల 1 వ తేదిన జీతాలు చెల్లించాలని అంగన్వాడీ ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని ఈ సందర్భంగా కోరారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ స్పందించి ప్రభుత్వం అన్నింటికీ సానుకూలంగా ఉందని అన్నారు.అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రదాన కార్యదర్శి ఎదురుగట్ల మమత,కొశదికారీ కొండికొప్పుల పద్మ,ఉపధ్యాక్షురాలు ఒరగంటి శ్యామల,రజినీ,మంజుల పాల్గొన్నారు.