బలగం టివి:
రానున్న 10 రోజులు పకడ్బంది ప్రణాళికతో ముందుకు సాగాలి.
ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా పకడ్బందిగా వ్యవహరించాలి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు ,సిబ్బంది నిర్వహించవలసిన విధివిధానాలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై సోమవారం రోజున సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సిరిసిల్ల సబ్ డివిసిన్ పరిధిలోని సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, సి.ఐ లు,ఎస్.ఐ లు లతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..
జిల్లాలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహనే లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీ ప్రణాళికతో పోలీస్ అధికారులు, సిబ్బంది ముందుకు సాగాలన్నారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి అధికారులు,సిబ్బంది ప్రతి ఒక్కరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బంధీగా విధులు నిర్వహించారు అని అదే ఉత్సాహంతో రానున్న 10 రోజులు కూడా ముందుకు సాగాలన్నారు.పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రచారం ఎక్కువ జరుగనున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు.పోలింగ్ కి ముందు రోజు, పోలింగ్ రోజు ,పోలింగ్ తర్వాతి రోజుతో పాటు ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు వరకు జాగ్రత్తలు విధులు నిర్వహించలన్నారు.
రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలు , బ్యాలెట్ బాక్స్ లకు రక్షణ కల్పించాలని, ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్టమైన పోలీస్ బందో బస్త్ ను ముందుగానే ఏర్పాటు చేయడం, ఎన్నికల సంఘం జారిచేసిన ప్రవర్తన నియమాల్ని కచ్చితంగా అమలు పరచాలని అన్నారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించడంతో పాటు గతంలో జరిగిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు.