–ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి బహమతులు ప్రధానం..
- ఎస్పీ అఖిల్ మహాజన్
బలగం టివి, ,రాజన్న సిరిసిల్ల :

పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకమని, గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది పని తీరు అమోఘం అని, అదే ఉత్సాహంతో భవిష్యత్తులో ఎదురైయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికో సిద్ధంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ లో సాయుధ ధళ పోలీసుల సమీకరణ కవాతు మొబిలైజేషన్ పెరేడు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించినారు.
ఈ సందర్బంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూమొబిలైజేషన్ పెరేడు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సాయుధ దళ పోలీసులకు రెండు వారాలు శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు.. ఇందులో భాగంగా ఆర్మ్ డ్ రిజర్వ్/ సాయుధ దళాలు యాన్యువల్ మొబిలైజేషన్ శిక్షణలో ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్, గార్డ్ మౌంటింగ్, మాబ్ఆపరేషన్,ఫైరింగ్,నాకబంది,పికెట్స్,విఐపిబందోబస్త్ డ్యూటీస్,ప్రిసనర్,క్యాష్ ఎస్కార్డ్స్,లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై శిక్షణనిచ్చామన్నారు.పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని మారుతున్న పరిస్థితుల క్రమంలో సాయుధ దళ సిబ్బంది సైతం శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులలో కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పారు.పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ,శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవడానికి ఈ మోబిలైజేషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది మొత్తం ఒకే దగ్గరకు వచ్చి శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం మోబిలైజేషన్ ద్వారా కలుగుతుందని,వ్యాయామం, యోగా నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.
మొబైలైజేషన్ లో భాగంగా అధికారులకు,సిబ్బందికి నిర్వహించిన ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, రవికుమార్, సిఐ లు అనిల్ కుమార్, ఆర్ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్,ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.
