బలగం టీవి,,, గంభీరావుపేట :
పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి అందిస్తున్న సేవలు నిరుపమానమని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు అన్నారు. అది వారం గంభీరావుపేట మండల కేంద్రంలోనీ శ్రీ దత్త సాయి ఫంక్షన్ హాల్ లో త్వరలో జిపి పాలకవర్గం పదవి కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా పారిశుద్ధ కార్మికులను, పాలకవర్గాన్ని సర్పంచ్ శ్రీధర్ పంతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ పంతులు మాట్లాడుతూ గంభీరావుపేట గ్రామానికి ఈ ఐదు సంవత్సరాల కాలం సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని, అందుకే జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు దక్కిందని, అభివృద్ధి విషయంలో జాతీయస్థాయిలో రాణించడానికి సహకరించిన పాలకవర్గానికి మరియు సిబ్బందికి కృతజ్ఞతల తెలిపారు.నేను పుట్టి పెరిగిన పెరిగిన గ్రామానికి నా శక్తి మేరకు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి వీలైనంత మేరకు కృషి చేయడం జరిగిందన్నారు..