బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ది సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ లి. సిరిసిల్ల సభ్యులకు మనవి చేయునది ఏమనగా తేది : 30-09-2024 నాటి మహాసభ తీర్మానము ప్రకారంగా సభ్యులు ఆమోదించిన విధముగా 2023-24 ఆర్థిక సంవత్సరమునకు గాను డివిడెండ్ ను వారి వారి వాటా ధనము కలిగియున్న దాని పై 12% డివిడెండ్ ను భారతీయ రిజర్వు బ్యాంకు హైదరాబాద్ అనుమతించిన దానిని పురస్కరించుకొని సభ్యుల ఖాతాలలో జమ చేయడానికి గాను (గతం లో మాదిరిగా) కావున సభ్యులు తమ యొక్క సేవింగ్ ఖాతాలను (KYC) ఆధార్, పాన్ వివరాలను అప్డేట్ చేసుకొగలరని, ప్రస్తుతం బ్యాంకు నందు 7200 మంది సభ్యులకు 4600 మంది సభ్యులు ఖాతాలు కలిగి ఉన్నారని, ఖాతాలు లేని సభ్యులు బ్యాంకు నందు సేవింగ్ ఖాతాను తెరిచి డివిడెండ్ ను ఖాతాలో జమ చేసుకోగలరని అన్నారు. తేది : 31-08-2024 నాటి నుండి టర్మ్ డిపాజిట్ల పై స్థానికంగా కల అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ ని ఇస్తున్నామని ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని, 2024-25 సంవత్సరానికి గాను డివిడెండ్ పెంచడానికి ప్రయత్నిస్తామని, బ్యాంకు యొక్క అర్ధ వార్షిక మహాసభ తేది 26-03-2025 బుధవారం రోజున ఉదయం 11 గంటలకు స్థానిక పద్మశాలి కళ్యాణ భవనం లో నిర్వహించబడును. కావున ఇట్టి మహాసభకు సభ్యులు హాజరు కాగలరని కొరుతున్నామని అన్నారు.
ఈ సమావేశంలో బ్యాంకు అధ్యక్షులు రాపెల్లి లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షులు అడ్డగట్ల మురళి, కార్యవర్గ సభ్యులు గుడ్ల సత్యనందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్ రాజు, బుర్ర రాజు, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాస్, ఏనాగందుల శంకర్, వలుస హరిణి, పత్తిపాక సురేష్, కొండ సంజీవ్, బ్యాంకు సీఈఓ తదితరులు పాల్గొన్నారు.