-బనకచర్ల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, వేములవాడ:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని,అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం వేములవాడ పట్టణంలో మినీ స్టేడియంను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు. మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీటవేస్తోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం, చందుర్తి మండలం మూడపల్లి వద్ద మినీ స్టేడియం నిర్మాణం, సిరిసిల్ల పట్టణంలో మినీ స్టేడియంలో నిర్మాణం కోసం స్థల పరిశీలన చేయడo జరిగిందన్నారు.
ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని,రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు. క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. బనకచర్ల పాపం బీ ఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోదావరి జలాల వాటా విషయంలో అడ్డుకున్నది తామే అని, అబద్దాలు ఆడడంలో హరీష్ రావు దిట్ట అని,ప్రజలను తికమక పెడుతున్నారని, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బనకచర్ల పాపం ఆనాటి కేసీఆర్దే అని 2016 సంవత్సరంలో కేంద్రంలో అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరైంది కేసీఆర్, హరీష్ రావులే అని అన్నారు.మాజీ సిఎం కేసీఆర్ రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని అన్నది అబద్దమా అని ప్రశ్నించారు. కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డి లు గోదావరి జిల్లాల విషయంపై నాలుగు సార్లు సమావేశం ఏర్పాటు చేసి గోదావరి జలాలను తీసుకెళ్లాలని చెప్పింది వాస్తవం కదా అన్నారు. 968 టీఎంసీలు గోదావరి జలాలు మా వాటా మాకు రావాలని,కాళేశ్వరం ను కేవలం ఎటిఎం గా వాడుకొని, కాలేశ్వరం తో వారి కుటుంబం బాగుపడిందనీ,కాళేశ్వరం ప్రాజెక్టు చుక్క నీరు వాడకుండానే దేశంలో అత్యధికంగా మన రాష్ట్రంలో మంచి పంటలు పండాయన్నారు..ఆంధ్రపదేశ్ కడుతున్న ప్రాజెక్ట్ లపై బీజేపీ వైఖరి ఫై కిషన రెడ్డి సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు.
శివ సేన రెడ్డి మాట్లాడుతూ తన స్పోర్ట్స్ చైర్మన్గా నియామకం అయిన నాటి నుండి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గం లో మినీ స్టేడియాలో నిర్మాణం చేయవలసిందిగా కోరుతున్నారు. వారి కృషి ఫలితంగా నేడు వేములవాడ నియోజకవర్గం లో రెండు స్టేడియాలు మంజూరు అయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం క్రీడాకారులను క్రీడలను ఏమాత్రం పట్టించుకోలేదు. వారు 10 సంవత్సరాల కాలంలో క్రీడలకు 400 కోట్లు కేటాయిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో 11 నెలల్లోనే 800 కోట్లు కేటాయించడం జరిగినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచి గ్రామాల్లో నుంచి ఒలంపిక్ లో ఆడేలా మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేస్తామని అన్నారు.



