ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా..

0
164

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

  • అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులు

ఈరోజు (మార్చి 2025) ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో కేజీబీవీ మరిపల్లి (వేములవాడ గ్రామీణం) విద్యార్థిని పి. హశ్విత 1000 మార్కులకు 974 మార్కులు సాధించింది. బైపీసీలో కేజీబీవీ సిరిసిల్ల విద్యార్థిని కె. వైష్ణవి 982/1000, సీఈసీలో కేజీబీవీ తంగళ్లపల్లి విద్యార్థిని వై. అశ్విని 913/1000 మరియు ఎంపీహెచ్‌డబ్ల్యూలో కేజీబీవీ తంగళ్లపల్లి విద్యార్థిని సిఎచ్. రేష్మ 968/1000 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

ప్రథమ సంవత్సరం ఫలితాలలోనూ కేజీబీవీ విద్యార్థినులు సత్తా చాటారు. ఎంపీసీలో కేజీబీవీ రుద్రంగి విద్యార్థిని కె. లహరిక 470 మార్కులకు 457, బైపీసీలో కేజీబీవీ మరిపల్లి విద్యార్థిని ఎన్.సుష్మిత 450 మార్కులకు 424, సీఈసీలో కేజీబీవీ తంగళ్లపల్లి విద్యార్థిని జె. రమ్య 500 మార్కులకు 454 మరియు ఎంపీహెచ్‌డబ్ల్యూలో కేజీబీవీ తంగళ్లపల్లి విద్యార్థిని కె. అర్చన 500 మార్కులకు 487 మార్కులు సాధించారు.

మొత్తం మీద ప్రథమ సంవత్సరంలో 356 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరుకాగా 301 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 260 మంది విద్యార్థినులు హాజరుకాగా 193 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను జిల్లా విద్యాధికారి సిఎచ్.వి.ఎస్. జనార్దన రావు ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here