బలగంటివి,, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక చౌరస్తా వద్ద గత కొన్ని నెలల నుండి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేయాల్సిన సీసీ కెమెరాలను రిపేర్ చేయడం కానీ వాటిపై దృష్టి కూడా పెట్టడం లేదు.ఇటీవల కొదురుపాక బ్రిడ్జి పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. సీసీ కెమెరాలు పనిచేస్తే ప్రమాదం చేసిన వ్యక్తి వాహనం సరైన సమయంలో దొరుకునని, కనీసం సిసి కెమెరాలు రిపేర్ (మరమ్మత్తులు) చేయడంలో అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.