బలగం టివి, రాజన్న సిరిసిల్ల
ఎస్పీ అఖల్ మహాజన్
జిల్లాలో చోటుచేసుకుంటున్న దొంగతనాలపై పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిఘాను పటిష్టం చేయాలని, అన్ని వనరులను సమర్థవంతంగా ఉపయోగిస్తూ ఎల్లవేళల నిఘా వ్యవస్థను పకడ్బందీగా అమలు పరుస్తూ దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలనీ ఎస్పీ అఖల్ మహాజన్ అన్నారు.శనివారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలిసు అఫీ స్ లో పోలిసు అధికారులతో జిల్లాలో జరుగుతున్న దోంగతనలు,నేరల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖల్ మహాజన్ మాట్లాడుతూ. గతంలో నమోదు అయిన కేసులు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు వాటిపై చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు అడిగారు. పోలీస్ స్టేషన్ ల వారిగా పెండింగ్ కేసుల దర్యాప్తు లు, పురోగతి లు అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ ఆఫ్ ఇన్విస్టిగేషన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ దర్యాప్తు లో ఉండాలని నేరస్తుల కు చట్ట ప్రకారం పడే శిక్ష తప్పించుకోకుండ రికార్డుల నిర్వహణ, సాక్ష్యాధారాల సేకరణ ఉండాలిని అన్నారు.పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు కృషి చేయాలనీ అన్నారు, స్టేషన్ అధికారులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన ముఖ్యమైన కేసుల పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. .దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.గ్రామాల్లో, పట్టణాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని , బస్టాండ్లలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలు విసిబుల్ పోలీసింగ్ లో నిఘా ఉంచాలని తెలిపారు.జిల్లా నందు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏవిధమైన చర్యలను తీసుకోవడం వలన ప్రమాదాలు తగ్గుతాయని , .రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై భారీ కేడ్స్,కోన్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు ,వాహనాల తనిఖీ లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.జిల్లా పరిధిలో గంజాయి, మతుపదార్థాల రవాణాపై దృష్టి పెట్టి నిఘా కఠినతరం చేయాలని,జిలాల్లో అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై దృష్టి పెట్టి కేసులు నమోదు చేయాలన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఉపయోగం, మతుపదార్థాల వలన కలుగు అనార్ధాల, ట్రాఫిక్ నియమాలు మొదలగు అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు.ఈ సమావేశంలో అధనవు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచారి,మహేష్ బాబు, సిఐ లు ,ఎస్ఐ లు,ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు