- 24 గంటల్లో పట్టుకున్న పోలీసులు.
*అభినందించిన ఎస్పీ అఖిల్ మహాజన్ - బలగం టీవి ,ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జనవరి 11వ తేదిన రాత్రి బిట్ల వెంకటేష్ కు చెందిన ఇంటిలో దొంగతనం చేసి బీరువాలోని బంగారు నెక్లెస్ రెండు తులాలు,రెండు బంగారు గొలుసులు రెండు తులాల పావు, అర్థ తులం బంగారు ఉంగరం, ఇంకొక చిన్న ఉంగరం,బంగారు బిస్కెట్ రెండు తులాలు, బంగారు చెవి కమ్మ,12 తులాల వెండి పట్టగొలుసులు 45 వేలు నగదు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారని వెంకటేష్ దరఖాస్తు ఇవ్వడం సీఐ సదన్ కుమార్,ఎస్సై టీమ్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానంతో 24 గంటలలో నేరస్తుడిని పట్టుకోవడం జరిగిందని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.నేరస్తుడు అంబటి శ్రీకాంత్ 35 సం.లు గంభీరావుపేట మండలం లింగన్నపేటకు గ్రామానికి చెందిన అనునతన్ని పట్టుకొని అతని వద్ద దొంగలించిన సొమ్మును స్వాధీన పరచుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు.నేరస్తుణ్ణి పట్టుకొనుటలో ప్రతిభ కనబరిచిన సి ఐ.సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ సిబ్బంది చంద్రశేఖర్, రాజ్ కుమార్,రాజశేఖర్ లను ఎస్పీ అఖిల్ మహాజన్ అబినందించినారు.నేరస్తుని నుండి ఏడు తులాల బంగారు ఆభరణాలు 12 తులాల వెండి,31వేల నగదు పల్సర్ బైక్ TS23 F 7967.సొత్తును స్వాధీన పరుచుకున్న వివరాలను ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలియజేశారు.
