బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఛలో వరంగల్ సభకు గ్రామీణ ప్రాంతాల నుండి గులాబీ దండు కదలాలి
వేములవాడ రూరల్ మండల నాయకులతో కెసిఆర్ సభ పోస్టర్ ఆవిష్కరించిన చల్మెడ
ఈ నెల 27 ఆదివారం నాడు ఛలో వరంగల్ ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ వద్ద కెసిఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో వేములవాడ రూరల్ మండల కేంద్రం నుండి కార్యకర్తలందరూ కలిసికట్టుగా రావాలని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.

ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని బహిరంగ సభ వేదిక ద్వారా కెసిఆర్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. అనంతరం చల్మెడ గారు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డిలు నాయకులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు గోస్కుల రవి, సీనియర్ నాయకులు మండల ప్రజాపతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
