ముహూర్తం కుదరలేదు: సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా.. కొత్త తేదీ ఇదే..!

0
46

నూతన సర్పంచుల అపాయింట్ డే ఈనెల 20 నుంచి 22 తేదీకి వాయిదా..

బలగం టీవీ, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచుల పదవీ బాధ్యతల స్వీకరణ (అపాయింటెడ్ డే) వాయిదా పడింది. తొలుత ఈ నెల 20న బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ గడువును డిసెంబర్ 22కు పొడిగిస్తూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 20వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సరైన శుభ ముహూర్తాలు లేవని, ఆ రోజున ప్రమాణ స్వీకారం చేయడం సెంటిమెంట్‌గా కలిసి రాదని పలువురు నూతన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముహూర్తం బాగాలేని కారణంగా బాధ్యతల స్వీకరణను రెండు రోజులు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు అందాయి. ప్రజా ప్రతినిధుల విన్నపాలను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం, అపాయింటెడ్ డేను డిసెంబర్ 22కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు డిసెంబర్ 22న ఏకకాలంలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here