బలగంటివి, ,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ లో మిట్టపెల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి సమావేశం నిర్వహించి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లగిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తన వద్ద పిఆర్ఓ గా పనిచేశానని తన సేవలు వినియోగించుకొని డబ్బులు ఇవ్వలేదని అన్నారు.ఈ సందర్భంగా తాను సిరిసిల్ల నుండి పాదయాత్ర నిర్వహించి హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడానికి పాదయాత్ర ద్వారా వెళుతున్నానని వివరించారు. తాను జనవరిలో కేసు పెట్టినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తనకు స్థానికంగా న్యాయం జరుగుతలేదని మానవ హక్కుల కమిషన్ ద్వారా సరైన న్యాయం జరుగుతుందని పాదయాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకొని మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేస్తానని మీడియా సమావేశంలో తెలిపారు.