పార్టీలోకి ఆహ్వానించిన కేకే మహేందర్ రెడ్డి
బలగం టివి ,,తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామ సర్పంచ్ బొబ్బల మంజుల మల్లేశం దంపతులు బుధవారం పూర్మాని మంజుల లింగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్ దంపతులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన నడుస్తుందని, ప్రజలందరూ నియంత, నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ప్రజాపాలనను తెచ్చుకున్నారని అన్నారు.ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్ర పూరోభవృద్దికి పాటుపడాలని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పాత కొత్త తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధిగా ఉండాలని సూచించారు.రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నాం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం మారలేదన్నారు.మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుగా చేసిన ఘనత కేసిఆర్ దేనని, నేరెళ్ల పేరు దేశం మొత్తం తెలిసింది అంటే అది ఇసుక దొంగల వల్లనేనని అన్నారు.ఇసుక లారీల కింద పేద ప్రజలు చనిపోయిన ఇక్కడి ఎమ్మెల్యే కేటీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని,దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి నానా హింసలు పెట్టిన ఏ ఒక్కరూ స్పందించలేదని నేరెళ్ళ బాధితుల ఉసురు ఊరికే పోలేదని ఆరోపించారు.పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందన్నారు.అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్,ఎంపీటీసీలు రాము, జలంధర్,జిల్లా నాయకులు వైద్య శివప్రసాద్,లింగాల భూపతి,లింగారెడ్డి,తిరుపతి రెడ్డి,కృష్ణారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు గుగ్గిళ్ళ శ్రీకాంత్,పొన్నాల పరశురాం, మునిగల రాజు,మల్లేష్ యాదవ్,గుగ్గిళ్ళ భరత్, శ్రీనివాస్ రెడ్డి,శంకర్,లక్ష్మణ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.