ద్విచక్ర వాహనంలను దొంగతనం చేసిన కేసులో 2 నెలల 10 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం మేరకు..10 ఆగస్టు 2023 న సిరిసిల్ల హాస్పిటల్ వద్ద పార్క్ చేసిన మరియు 26 మే 2023. రోజున కోర్టు దగ్గర గల HDFC వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనం దొంగతనం చేసిన వ్యక్తిపై సగాల్ల దేవయ్య (గోపల్ నగర్ సిరిసిల్ల) మరియు సంది నారాయణ రెడ్డి(ఎల్బాక వీనవంక) అను వారు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనంలను దొంగతనం చేసిన నిమిషకని ప్రణీత్ తండ్రి లింగయ్య వయసు 30 yrs, విద్యానగర్ సిరసిల్ల చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.విచారణ అనంతరం విచారణ అధికారి P. శ్రీనివాస్ రావు SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.
CMS SI లావుడ్య శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ గారి ద్యారా నిందితుడు నేరంను కోర్టులో అంగీకరించటంతో
కేసు పూర్వపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ నిందితుడికి 2 నెలల 10 రోజులు జైలు శిక్ష విధించారని టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.