బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై విషం చిమ్ముతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది అన్నారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనిల్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కూడా చాలామంది హిందువులేనని మేము కూడా దేవుళ్లను కొలుస్తామన్నారు.కేవలం శ్రీరామచంద్రుడిని తమ స్వప్రయోజనాలకు బిజెపి పార్టీ వాడుకుంటుదని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరించినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరిస్తే ఊరుకోరని ప్రజల మధ్యనే గట్టిగా బుద్ధి చెబుతామన్నారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్ కే సాహెబ్,జిల్లా నాయకులు గిరిధర్ రెడ్డి,మర్రి శ్రీనివాస్ రెడ్డి, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి,రోడ్డ రామచంద్రం,వంగ మల్లారెడ్డి, ఏలూరి రాజయ్య,మండల నాయకులు చెన్ని బాబు,గంట బుచ్చగౌడ్, కొత్తపెళ్లి దేవయ్య, సూడిద రాజేందర్, బుగ్గ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.