- మధ్యమానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి నీళ్లు ఎత్తిపోతలు ప్రారంభించాలి
- నెర్రెలు భారిన మాగాణం….నీళ్లు విడుదల చేయకుంటే పోరాటం తప్పదు
- ఆనంతగిరిలో ఎండిన పొలాలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
- రాజజీయ బేషజాలకు వెళ్లకుండా ఎమ్మెల్యే స్పందించి నీళ్లు విడుదల చేయించాలి
- నాలుగైదు రోజుల్లో నీళ్లు విడుదల చేయకుంటే రైతులతో కలిసి రోడ్డెక్కుతాం
బలగం టివి,ఇల్లంతకుంట
మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండి మీదుగా సూర్యాపేట, హుస్నాబాద్, జనగామ ప్రాంతాలకు నీళ్లు కాల్వల ద్వారా తరలిస్తున్నరని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రం మధ్యమానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ లోకి నీళ్లు తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు .శుక్రవారం ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామంలో ఎండిన పంట పొలాలను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ నర్రెలు భారిన తెలంగాణ రాష్ట్రంలోని భీడుభూములను సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష ఎకరాలకు సాగునీళ్లు ఇస్తే …ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పొలాలకు నీళ్లు ఇవ్వడం లేదని అన్నారు.సీమాంధ్ర పాలనలో నీళ్ల లేక రైతులు పొలాలను బీళ్లు పెట్టి గల్ఫ్ దేశాలతో పాటు ముంబాయి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస పోయారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబడుతొందని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాజకీయ బేషజాలకు వెళ్లకుండా అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి నీళ్లు ఎత్తిపోతలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయఆర్భాటంగా గత కొన్ని రోజుకు క్రితం మండలంలోని ప్రాజెక్టులను పరిశీలించారని, ఇప్పుడు నీళ్లు విడుదల చేయించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నరని అన్నారు.నాట్లు వేసిన పక్షం రోజులకే పొలాలన్ని ఎండిపోయి రైతులు పెట్టిన పెట్టుబడులు మట్టిపాలయ్యే ప్రమాదం ఉందని, కాంగ్రెస్ పాలన చూస్తుంటే మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయని అన్నారు.నాలుగైదు రోజుల్లో అనంతగిరి రిజర్వాయర్ లోకి నీళ్లు విడుదల చేసి, బిక్కవాగు ద్వారా నీళ్లు విడుదల చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఎర్రటి ఎండకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు దూకాయని, ఇప్పుడు చెరువులు, పొలాలు ఎండిపోయి రైతులు అన్నమొ రామచంద్ర అనే పరిస్థితి వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు గొట్టెపర్తి పర్శరాం, పట్నం అశ్విని శ్రీనివాస్, సావనపెళ్లి వనజ అనీల్, పోచమ్మ ఆలయ చైర్మన్ బాలగౌడ్, మాజీ ఉపసర్పంచ్ లు బాలకిషన్, ఆంజనేయులు, మాజీ చైర్మన్ రాజారాం, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

