బలగం టివి,
సొంత కొడుకు, సొంత తమ్ముడు, ఇద్దరు కలిసి హత్య చేశారు
మంత్రాలు తంత్రాలు అనే అభూతమైనా కల్పనతో భూమయ్య హత్య
కేసు యొక్క వివరాలు సిద్దిపేట రూరల్ సీఐ యం. శ్రీను తెలియపరుస్తూ
మృతుని వివరాలు
నిమ్మ భూమయ్య తండ్రి మల్లయ్య, వయస్సు 56 సంవత్సరాలు, గ్రామం నామాపూర్, మండలం ముస్తాబాద్.
నిందితుల వివరములు
1) నిమ్మ కనకయ్య తండ్రి మల్లయ్య వయస్సు 56 సంవత్సరాలు, గ్రామం నామాపూర్ మండలం ముస్తాబాద్ జిల్లా రాజన్న సిరిసిల్ల
2) నిమ్మ ప్రవీణ్ తండ్రి భూమయ్య, వయస్సు 26 సంవత్సరాలు, గ్రామం
నామాపూర్ మండలం ముస్తాబాద్ జిల్లా రాజన్న సిరిసిల్ల ప్రస్తుత నివాసం సిద్దిపేట పట్టణం
తేదీ: 09-02-2024 నాడు రాఘవపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని సగం కాలిన మగ మృతదేహం లభించింది. అందుకుగాను నేరం నెంబర్: 28/2024, U/s: 302, 201 IPC క్రింద సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగినది. ఇట్టి కేసు నందు ఆధునిక టెక్నాలజీ మరియు పరిశోధనలో భాగంగా తేదీ:11-02-2024 నాడు ప్రవీణ్ మరియు కనకయ్యలు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పై హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కు తండ్రి, కనకయ్యకు సొంత అన్న భూమయ్య అని తెలిపినారు.
విచారణలో భాగంగా కనకయ్య కుటుంబ సభ్యులకు గత కొన్ని రోజుల నుండి ఆరోగ్యం బాగా ఉండటం లేదు మరియు భూమయ్య అతని కుటుంబ సభ్యులపై మంత్రాలు చేశాడని కనకయ్య కక్ష పెంచుకున్నాడు. తేదీ :08-02-2024 నాడు భూమయ్య తల్లికి ఆరోగ్యం బాగా లేకపోతే, ప్రవీణ్ మరియు భూమయ్యలు కలిసి నామాపూర్ గ్రామంలో గల కనకయ్య ఇంటికి తన తల్లిని చూడడానికి ఇద్దరు కలిసి బస్సులో సిద్దిపేట నుండి వెళ్ళినారు. అక్కడికి వెళ్లిన తర్వాత గొడవలు జరగడంతో కనుకయ్య మరియు ప్రవీణ్ లు భూమయ్యను చంపాలని నిర్ణయించుకొని పురుగుల మందు కొనుగోలు చేసినారు. కనకయ్య రెండు బీర్లు, ఓసి ఆఫ్ బాటిల్ తీసుకొని బండి మీద నామాపూర్ గ్రామం నుండి సిద్దిపేటకు బయలుదేరారు. రాఘవపూర్ గ్రామ శివారికి రాగానే పిట్టలవాడ పక్కన గల పంట పొలాలలో ముగ్గురు కలిసి ఆల్కహాల్ ను సేవించి ప్రవీణ్ ఆల్కహాల్ లో పురుగుల మందును కలిపి తన తండ్రి భూమియకు ఇచ్చినాడు. అది తాగిన భూమయ్య అక్కడికక్కడే చనిపోయాడు మరియు ప్రవీణ్ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు భూమయ్య ముఖము మరియు శరీరంపై అక్కడే గల గడ్డిని వేసి నిప్పంటించినాడు. తర్వాత ప్రవీణ్ మరియు కనకయ్యలు అదే బండిపై నామంపూర్ కి వెళ్ళినారు అని నిందితులు తెలిపినారు.
నిందితులను అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి పట్టుకొని సిద్దిపేట రూరల్ సిఐ శీను అరెస్టు చేసి జ్యుడిషియల్ డిమాండ్ కు పంపించడం జరిగింది.
ఈ సందర్భంగా రూరల్ సిఐ శ్రీను మాట్లాడుతూ ఎంతో అభివృద్ధి చెందిన మెడికల్ వ్యవస్థ ఉన్నందున ఆరోగ్యం బాగోలేకపోతే ఎన్నో గొప్ప గొప్ప ఆసుపత్రిలో ఉన్నాయనిటెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని ఇంత పెద్ద ఆరోగ్య సమస్య చికిత్స ద్వారా మెరుగుపరుచుకునే అవకాశం ఉందని తెలిపారు.
మంత్రాలు తంత్రాలు అంటూ మూఢనమ్మకాలతో గ్రామాలలో కక్షలు పెంచుకొని వ్యక్తులను దారుణంగా చంపడం మంచిది కాదని హితవు పలికారు.
ఈ సమావేశంలో సిద్దిపేట రూరల్ ఎస్ఐ కిరణ్ రెడ్డి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.