వ్యవసాయ రంగం, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు.. బాధ లేదు..

బలగం టీవీ, హైదరాబాద్:

  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం అందించే పథకం రైతుబీమా.. రైతు చనిపోయిన ఏడు పనిదినాలలో రైతు కుటుంబానికి పరిహారం అందేది అని,ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలలో ఒకటి రైతుబీమా, రైతుబంధు అని యూఎన్ఓ కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ప్రకటించిందని, రైతు బీమా పథకం ప్రవేశపెట్టిన తరువాత  డిసెంబర్ 4, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్రంలో 1,18,197 మంది రైతులు మరణించగా రూ.5,909.85 కోట్లు ఆ రైతు కుటుంబాలకు పరిహారంగా అందించడం జరిగిందని అన్నారు.

రైతుబీమా పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6122.65 కోట్లు ఎల్ఐసీ కి ప్రీమియంగా చెల్లించింది అని,ఏడాదికి రూ.1500 కోట్లకు గాను రెండో విడత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.750 కోట్ల ప్రీమియం చెల్లించని కారణంగా ఏడు వేల పైచిలుకు కుటుంబాల పరిహారం పెండింగులో ఉన్నాయని 440కి పైగా రైతులు 15 నెలల రైతుల ఆత్మహత్య లు చేసుకున్నారని, కరంటు రాదు, నీళ్లు రావు, రైతుబంధు రాదు, రైతుభీమా ప్రీమియం చెల్లించరు అని.. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తున్నది ? కాంగ్రెస్ అభయహస్తంలో వ్యవసాయానికి రూ.3 లక్షల వడ్డీ లేని రుణం అన్నారు. 24 గంటల కరంటు అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ మొదలే పెట్టలేదు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీలను భర్తీ చేయలేదు. అసైన్డ్ పోడు భూములకు పట్టాభూములతో సమానంగా పరిహారం అని దాని ఊసెత్తడం లేదని, ప్రభుత్వ భూములను కుదువపెట్టి రైతుభరోసా కోసం అని రూ.10 వేల కోట్లు తెచ్చి రెండు నెలలు అవుతుందని మూడెకరాల వరకు రైతులకు కూడా రైతుభరోసా నిధులు పడలేదని, మూడెకరాల వరకు రైతుభరోసా ఇచ్చామని వ్యవసాయ మంత్రి చెబుతుంటే మూడెకరాల వరకు రైతులకు డబ్బులు వేయాలని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారని అన్నారు.

పది వేల కోట్లు తెచ్చిన ప్రభుత్వానికి రూ.750 కోట్లు రైతుభీమా ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదు?ఇది రైతు అనుకూల ప్రభుత్వమా ? రైతుబీమాను ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే సాగునీళ్లు లేక, కరంటు లేక రైతుల పొలాలు ఎందుతున్నాయి పశువులకు మేతగా మారుతున్నాయి అని అన్నారు.

రాష్ట్రంలో అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారని, యాసంగి సీజన్ మొదలయ్యే సమయానికి దాని మీద సమీక్ష చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని, రాష్ట్ర ప్రభుత్వ అన్ని వైఫల్యాలకు కారణం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది అని,రైతులు పంటలు వేసుకున్న తర్వాత రైతు కమీషన్ చైర్మన్ కోదండరెడ్డితో రైతులు పంటలు వేసుకోవద్దు అని చెప్పించారని,ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖా మంత్రి చెప్పకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారితో సాగునీళ్లకు కొరత లేదని చెప్పించారని,మరి నీటికి, కరంటుకు సమస్య లేకుంటే రైతులు దేనికి ఆందోళన చెందుతున్నట్లు? ప్రభుత్వం  సాగునీటి మీద సమీక్ష ఎందుకు చేయలేదని అన్నారు.

ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్ శాఖా మంత్రులు ధైర్యం ఉంటే పంటలు ఎండుతున్న రైతుల పొలాల వద్దకు వెళ్లి రైతులను కలవాలని,రాష్ట్రంలో ఎక్కడా పంటలు ఎండడం లేదని ధైర్యం ఉంటే ప్రభుత్వం ప్రకటించాలని కష్టపడి సాగు చేసే రైతులు తమ పంటలను ఊరికెనే పశువులకు వదిలేస్తారా అని,రోజూ అబద్దాలతో కూడిన రాజకీయాలు చేయడం తప్ప ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని,రాష్ట్ర జనాభాలో 50 నుండి 60 శాతం ఉండే రైతులు, రైతుకూలీలు, దాని అనుబంధ రకాల ప్రజలు జీవించే వ్యవసాయరంగం గురించి పట్టించుకోకుంటే ఈ ప్రభుత్వం దేని గురించి పట్టించుకుంటుందని,రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు, వర్షాలు ఉన్నా దానిని నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైంది అని అన్నారు.

కరెంటు, సాగునీటి కష్టాల కారణంగా రైతుభరోసా ఇవ్వని కారణంగా రైతులు రాష్ట్రంలో ఆందోళనలో ఉన్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,మంత్రులు రైతుల వద్దకు వెళ్లి భరోసా కల్పించాలని ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం కల్పించాలి. తుంగతుర్తి, సూర్యాపేటలకు 300 కిలోమీటర్ల దూరం కాళేశ్వరం నీళ్లను తీసుకువచ్చి బీఆర్ఎస్ హయాంలో పంటలు పండించారని అన్నారు. గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని,వ్యవసాయరంగాన్ని ఎంతో బాధ్యతతో కేసీఆర్ పాలనలో ముందుకు తీసుకెళ్లామని రైతాంగం బాధలను దిగమింగాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వేడుకుంటున్నామని, మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దని ముకుళిత హస్తాలతో  కోరుతున్నామని ప్రాధేయపడుతున్నామని వేచి ఉండండి సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని శిక్షించండి అని అన్నారు.

ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల బాధ్యత లేదు .. బాధ లేదని, రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు, పథకాల అమల్లో కాంగ్రెస్ విఫలం అయిందని వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామని రాహుల్ సమక్షంలో ప్రకటించిన కాంగ్రెస్ దానిని అమలు చేయకుండా మోసం చేస్తుందని అన్నారు.

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లతో బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş