బలగంటివి, , ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలంలో జరుగుతున్న దొంగతనాలను నివారించడానికి ప్రత్యేక నిఘా టీమ్లను ఏర్పాటు చేసి, రాత్రి వేళలో గస్తీ చేస్తుండగా, బొప్పాపూర్ గ్రామ శివారు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు అనుమాన స్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకుని విచారించగా వారి పేర్లు 1).బోండ్ల గణేష్, తండ్రి రాజయ్య, గ్రామం బొప్పాపూర్.2) బొమ్మనవేణి భరత్, తండ్రి నర్సయ్య, గ్రామం బొప్పాపూర్.3) పని అఖిల్, తండ్రి చంద్రయ్య, గ్రామం కొనరావుపేట అనువారు అని తెలిసింది.ఈ రోజు వారిని విచారించి ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రాత్రివేళలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగిన, కనిపించిన, పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు అట్టి వారి పైన తగిన చర్యలు తీసుకోబడునని ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.