బలగం టీవి …
పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు..
ఈరోజు స్థానిక మూడో వార్డు లో శ్రీ అభయాంజనేయ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమంలో గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..
ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ ..
మన సాంస్కృతి సాంప్రదాయాలలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత వుంది ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఆడపడుచులు వారి ఇంటి ముందు వాకిట్లో అందమైన రంగులతో ముగ్గులు వేసి పండగ పూట ఇంటికి కొత్త వెలుగులు తీసుకువస్తారు అని అన్నారు..
ముగ్గు వేయడం అనేది మహిళలకు ఎంతో ఇష్టమైన పని అని ఎంత పని ఒత్తిడి ఉన్న పండగ పూట ఇంటి ముందు ముగ్గు వేయడం మహిళలకు వెలకట్టలేని సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు.
ఈరోజు శ్రీ అభయాంజనేయ సొసైటీ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీని ఏర్పాటుచేసి నవతరానికి ముగ్గుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుండడం కన్నుల పండగ ఉందని ఈ పోటీలలో పాల్గొన్న మహిళలందరూ వారి నైపుణ్యాన్ని వారి కళాత్మకతను మన సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చక్కని సందేశాత్మకంగా ముగ్గులు వేసి ప్రతి ఒక్కరూ వారి ప్రతిభను తెలియజేశారు ఈ ముగ్గుల పోటీలలో ప్రతి ఒక్కరి ముగ్గు ప్రత్యేకమైనదే కాబట్టి ఈ ముగ్గులు వేసిన వారిలో నుండి విజేతలను ఎంపిక చేయడం చాలా కష్టమైన పనిగా అయిందన్నారు..
స్వల్ప తేడాతో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ శ్రేణులలో విజేతలను ఎంపిక చేసిన ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని అన్నారు..
అనంతరం విజేతలకు బహుమతులను అందించారు..
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అంజలి దేవి గారు, ప్రముఖ వైద్య నిపుణురాలు శోభారాణి గారు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ గారు పాల్గొనగా పట్టణ ప్రముఖులు, శ్రీ అభయాంజనేయ సొసైటీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు…