బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గంభీరావుపేట మండలంలో ఆదివారం జరగనున్న ఉపముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
పర్యటన నేపథ్యంలో గంభీరవుపేట మండలంలోని కార్యక్రమ ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాలను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధులు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.
ఈ పరిశీలనలో సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ అనిల్ తదితర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




