మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 730 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు..

0
63

-పోలింగ్, కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.

– ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

మూడో విడత పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా,ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా 730 పోలీస్ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ సందర్భంగా ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రూట్ మొబైల్స్:33, జోనల్ టీమ్స్:06 (ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో), క్విక్ రియాక్షన్ టీమ్స్:04, స్ట్రయికింగ్ ఫోర్స్:02 ఏర్పాటు చేసి మొత్తం 730 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లరాదని, రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద,రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.

  • ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం..
  • నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉందని ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే లు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అన్నారు.

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని,ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన తీసుకుంటాని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here