బలగం టివి:
రాజన్న సిరిసిల్ల వేములవాడ ఎమ్ఎల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.శుక్రవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, ఆలయ ఉద్యోగ సంఘం నాయకులు .. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసంలో తనను కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు.రాజన్న ఆలయ అర్చకుల స్వాములు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వేదమంత్రాలతో ఆశీర్వదించి.. పూలమాలవేసి , శేష వస్త్రం కప్పి సన్మానించి.. స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
