సాధారణ భక్తులకు దర్శన ఇబ్బందులు దూరం చేసేందుకు…విఐపి బ్రేక్ దర్శనం

0
85

మహాశివరాత్రి జాతర ను రాష్ట్ర పండుగగా భావించి ఏర్పాట్లు చేయాలి.

– ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, భక్తీభావం ఉట్టిపడేలా మహా శివరాత్రికి న్యూ గ్రాండ్ లుక్ తలపించేలా ఏర్పాట్లు ఉండాలి

– మహా శివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్

బలగం టివి:వేములవాడ:

 రాజన్న దర్శనంకు వచ్చే  సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా  తిరుమల తరహాలో విఐపి బ్రేక్ దర్శనంకు ఏర్పాట్లు చేయాలనీ ,విఐపి బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం గంట చొప్పున విఐపి లకు   బ్రేక్ దర్శనంకు అవకాశం ఇవ్వాలి.విఐపి బ్రేక్ దర్శనంకు సాధ్యాసాధ్యాలపై క్షేత్ర అధ్యయనం చేయాలన్నారు.వీలైతే శివరాత్రి జాతరలోగానే బ్రేక్ దర్శనం కు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. మంగళవారం మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని వేములవాడ  శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఓపెన్ స్లాబ్ లో కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశ  నిర్వహించారు.ఈ సమావేశంనకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మహాశివరాత్రి సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశిష్టత, ప్రాధాన్యత పెరగడం వల్ల ఆలయం కు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందనీ, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, భక్తీభావం ఉట్టిపడేలా మహా శివరాత్రికి న్యూ గ్రాండ్ లుక్ తలపించేలా, భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలని,భక్తుల కోసం తెల్లని వస్త్రం తో కూడిన చలువ పందిళ్ళు వేయాలని ఆలయ అధికారులకు సూచించారు.మహాశివరాత్రి జాతర ను రాష్ట్ర పండుగగా భావించి భక్తులు సులభంగా, వేగంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. శివ స్వాములు, పుర ప్రముఖులు, పాత్రికేయుల కు సులభ దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.ప్రస్తుతం భక్తుల కోసం రెండు క్యూ లైన్ ల సిస్టం ఉన్న దృష్ట్యా విఐపి ల కోసం మూడో క్యూ లైన్ శివరాత్రి లోగా ఏర్పాటు చేయాలని చెప్పారు. బద్ది పోచమ్మ వద్ద కూడా భక్తులకు త్రాగునీరు, కూర్చునేందుకు కుర్చీలను , పందిల్ల సౌకర్యం కల్పించాలని చెప్పారు.క్తులుకు బస్స్టాండ్ లో మూత్రశాలలు,త్రాగు నీరుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.కంట్రోల్ రూమ్ ల వద్ద ప్రజా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి మైకు ద్వెరా భక్తులకు తెలియజేసే సౌకర్యం కల్పించాలన్నారు.గతంలో జోన్ ల స్థానంలో మానిటరింగ్ పెంచేందుకు పిన్ పాయింట్ లొకేషన్ లుగా విభజించిప్రతీ పాయింట్ లో ఒక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలన్నారు  ఒక యూనిట్ చొప్పున తీసుకొని దానికి ఒక ఇంచార్జి నియమించి దాని నిర్వహణపై పర్యవేక్షణ ఉంచాలన్నారు.నిఘా నేత్రాలతో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ,శాశ్వత సీసీ కెమెరా లను పెట్టాలన్నారు.

కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ..

మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సౌకర్యాలు కల్పించాలని  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. భక్తులు స్వామి వారి దర్శనాన్ని వేగంగా, సౌకర్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని వివరించారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దాకా, వేములవాడను కనెక్ట్ చేసే అన్ని అప్రోచ్ రోడ్లను , పట్టణ అంతర్గత రోడ్ల మరమ్మత్తు పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మే ఐ హెల్ప్ యూ’ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దానిలో పనిచేసే సిబ్బంది వద్ద ఆలయానికి సంబందించిన పూర్తి సమాచారం, అందరి ఫోన్ నంబర్ లు ఉండాలని తెలిపారు. జాతర విధుల్లో పాల్గొనే అన్ని శాఖల అధికారులు వారి సమగ్ర యాక్షన్ ప్లాన్ తో రావాలని, జాతర సందర్బంగా ఆ అధికారి అందుబాటులో లేరనే సమాధానం రాకూడదని  స్పష్టం చేశారు. భక్తులకు నిత్య అన్నదానం కల్పించే విషయం పరిశీలించాలని, దేవాదాయ శాఖ ఉన్నత అధికారులను సంప్రదించాలని సూచించారు. జాతర ప్రదేశాల్లో నాణ్యమైన తాగునీటిని అందుబాటులో పెట్టాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. బద్ది పోచమ్మ ఆలయానికి బోనాలతో వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరో సమావేశం నిర్వహిస్తామని, అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు.

జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు స్వామి వారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, భక్తులకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ…

మహా శివరాత్రి సందర్బంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. వేములవాడ లో కావాల్సిన సైన్ బోర్డ్, టోయింగ్ వాహనం, క్రేన్ అందుబాటులో ఉంచాలని ఆలయ ఈవోకు సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాలంటీర్ లను తమకు అప్పగించాలని వివరించారు. హోటల్, లాడ్జ్ ల నిర్వహకులను వచ్చే సమావేశానికి రావాలని సూచించారు. ఆలయం అధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, టైని ఐపిఎస్ రాహుల్ రెడ్డి, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్,వేములవాడ ఆర్డీవొ మధు సూదన్ , డీఎస్పీ నాగేంద్ర చారి, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here