రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా సాగిన టాస్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు

0
116

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టాస్ (TOSS) పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం (25.04.2025) ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (ఎఫ్.ఎ.సి.) సి.హెచ్.వి.ఎస్. జనార్దన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం జరిగిన పరీక్షలకు జిల్లాలోని మూడు కేంద్రాల్లో మొత్తం 704 మంది విద్యార్థులకు గాను 90.63 శాతం హాజరుతో 638 మంది విద్యార్థులు హాజరయ్యారు. 66 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు పరీక్షా కేంద్రాల్లో 52 మంది విద్యార్థులకు గాను 90.38 శాతం హాజరుతో 47 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆరవ రోజు పరీక్షలు కూడా సజావుగా జరిగాయని జిల్లా విద్యాధికారి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here