బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం (23.04.2025) ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని జిల్లా విద్యాశాఖాధికారి Ch.V.S. జనార్దన్ రావు తెలిపారు.
ఉదయం జరిగిన పరీక్షలకు జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 784 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 703 మంది (89.67%) హాజరయ్యారు. 81 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.
మధ్యాహ్నం రెండు పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 124 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 110 మంది (88.71%) హాజరయ్యారు. 14 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.
మూడవ రోజు పరీక్షలు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా విద్యాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.