బలగం టీవీ, హైదరాబాద్:
కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ లో ప్రగతి నగర్ రోడ్ నెం.1 ఎదురుగా ఉన్న ప్రేమ్ అనే వ్యక్తి ఇంటిలో నిన్న ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడి ఇంటి తో పాటు అద్దెకు ఉన్న ఉపేందర్ అనే బైక్ మెకానిక్ షాప్ మంటల్లో దగ్ధమైన విషయం తెలుసుకున్న టిపిసిసి ఉపాధ్యక్షలు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ సంఘటన స్థలాని పరిశీలించి బాధితులను ఓదార్చి స్థానిక కూకట్ పల్లి తహసీల్దార్ కి ఫోన్ చేసి మాట్లాడి సంఘటన స్థలాని పరిశిలించమని చెప్పి బాధితులకు కాంగ్రెస్ పార్టి తరపున మరియు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, గోపిశెట్టి రాఘవేందర్, తూము సంతోష్, సప్పిడి భాస్కర్, తూము కొండల్, విజయ్, ఎండీ నయీమ్ తదితరులు పాల్గొన్నారు




