చిత్రపురి కాలనీలో విషాదం, ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహ*త్య…

0
74

బలగం టీవీ, హైదరాబాద్:

మణికొండలోని చిత్రపురి కాలనీలో విషాదం నెలకొంది. ప్రముఖ యువ యూట్యూబర్ కోమలి తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఏడాది క్రితం అఖిల్ రెడ్డి అనే వ్యక్తితో కోమలికి బ్రేకప్ అయ్యిందని, అప్పటి నుండి ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మనోవేదన భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here