హైడ్రోపోసిక్స్ సాగు విధానంపై శిక్షణ కార్యక్రమం

0
219

బలగం టివి,  తంగళ్ళపల్లి

బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల జిల్లెళ్ళ గ్రామంలో హైడ్రోపోసిక్స్ సాగు విధానంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ భవ్య శ్రీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతులు తక్కువ నీటితో తక్కువ స్థలంలో ఎక్కువగా పంటను ఎలా పండించాలో వివరించారు. హానికర మందులు వాడకుండా,వేప నూనె వాడి చీడపీడ పురుగుల నుండి పంటను కాపాడుకోవడం వంటి అంశాలు వివరించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం నుండి సుమారు 30 మంది మహిళా రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here