బలగం టివి ,సిరిసిల్ల:
ఎన్నికల బదిలీల నేపథ్యంలో డిపిఅర్వో మామిండ్ల దశరథం సమాచార, పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కు బదిలీ అయ్యారు.ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం సమాచార హెడ్ ఆఫీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో మామిండ్ల దశరథం కొనసాగుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జీ బాధ్యతలు చూస్తున్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఐదున్నర సంవత్సరాలు సేవలు అందించారు. సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లా పౌర సంబంధాల అధికారి గానూ పని చేశారు.ఫ్రెండ్లీ ఆఫీసర్ గా పేరుపొందారు. గతంలో కీలకంగా ఉన్న సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమర్థవంతంగా పని చేసి,డాక్యుమెంటరీ లు రూపొందించారు.మీడియా ను ఎప్పటి కప్పుడు సమన్వయం చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో విశేష కృషి చేశారు. కరీంనగర్ డిపిఅర్వో కార్యాలయంలో అదనపు పౌర సంబంధాల అధికారి గా పని చేస్తున్న శారద ను బదలి చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జీ డిపిఅర్వో గా నియమించారు.