బలగం టివి, ఇల్లంతకుంట
బదీలిపై వెళ్తున్న ఎస్ఐ దాస సుధాకర్ ని సన్మానించిన గౌరవ ఎంపిపి
పోలీస్ వృత్తిలో బదీలిలు సహాజమని, ప్రజలకు మంచి చేస్తూ, అసాంఘిఖ శక్తుల తాటతీసి మంచి పేరు ను ఎస్ఐ దాససుధాకర్ సంపాదింతుకున్నారని ,గౌరవ ఎంపిపి _వుట్కూరి వెంకట రమణా రెడ్డి అన్నారు. ఇల్లంతకుంట ఎస్ ఐ గా విధులు నిర్వరించి, తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ కు బదీలిపై వెళ్తున్న దాస సుధాకర్ ను తన ఎంపీపీ చాంబర్ లో శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. నేర నియంత్రణలో ఎస్ఐ పాత్ర అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసే ఐలయ్య, ఏలేటి మాధవ రెడ్డి, గాజుల రాములు, పోతరాజుపర్శరాం, మామిడి నరేష్, రామకృష్ణ, న్యాత అశోక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.