*సన్మానించిన స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బాలయ్య.
బలగం టివి, , ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ ముద్విరాట్ వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బ్రహ్మశ్రీ విశ్వబ్రాహ్మణ పురోహిత జిల్లా అధ్యక్షుడు సద్గుణచారిని మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజు బాలయ్య,విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు నర్మాల సద్గుణచారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జ్యోతిష్యం,వాస్తు,పురోహితంలో బ్రహ్మశ్రీ సద్గుణచారి సేవలను గుర్తించి వివేకానంద,సుభాష్ చంద్రబోస్ జయంతుల సందర్బంగా యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ హైదరాబాద్ వారు అవార్డులను అందజేశారని పేర్కొన్నారు.శ్రీ శాంతికృష్ణ సేవా సమితి,తెలుగు వెలుగు సాంఘిక వేదిక,విశ్వకర్మ సేవ ఫౌండేషన్, విశ్వకర్మ గాయత్రి నాట్య కళ వేదిక వారు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పురస్కారం అవార్డులు ఆయన అందుకున్నారన్నారు.వరంగల్ నగరంలో కీర్తి పురోహిత బ్రహ్మ పురస్కారాన్ని అందుకున్నారని తెలిపారు.ప్రతి సంవత్సరం వరంగల్ లో నిర్వహించే జాతీయ పురస్కార అవార్డులను సద్గుణ చారి అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారిని సన్మానించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజు కిషన్ చారి, వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం చైర్మన్ చింతోజు శ్రీనివాస్ చారి, ఓరగంటి బ్రహ్మచారి, చింతోజు సంతోష్ చారి, పొలాలరాం ప్రసాద్ చారి తదితరులు పాల్గొన్నారు