బలగం టివి ,,ముస్తాబాద్.
ముస్తాబాద్ మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కస్తూరి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి,మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్బంగా చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమాచారం చేరవేస్తూ నిజాన్ని నిర్భయంగా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడమే జర్నలిస్టుల పని అని పేర్కొన్నారు.ప్రజలను చైతన్యం చేసే విధంగా వార్తలు రాయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, భాను, ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు,దేవరెడ్డి, తోట ధర్మేందర్, కిషన్ రావు, రాజం, దేవేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.