బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఏ.బి.సి.డి వర్గీకరణ కోసం అమరులైన వారిని స్మరించుకుంటూ మండల కేంద్రంలో శనివారం రోజున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల శాఖ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అక్కెనపల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ: రిజర్వేషన్ పోరాటంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా జాతీయ ఉద్యమాన్ని నడిపి, వారి చివరి ఊపిరి వరకు జాతి ఉద్యమం కోసం, పనిచేసే వారి ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూన్నమన్నారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఉపాధ్యక్షులు పులివెందుల రాజు, జంగం శ్రీధర్, కన్నం సాగర్, సీనియర్ నాయకులు సావనపల్లి రాజయ్య అల్వాల అంజయ్య, కొర్లపల్లి అంజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.