బలగం టివి , రాజన్న సిరిసిల్ల
అమరవీరుల సంస్మరణ….
రెండు నిమిషాల మౌనం
- హాజరైన అదనపు కలెక్టర్ లు

దేశ స్వాతంత్య్ర ఉద్యమ సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది
సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఘన నివాళి అర్పించారు.
అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి లు అమరులను స్మరించుకుంటూ 2నిమిషాలు వౌనం పాటించారు.
జాతిపిత, మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ప్రతి ఏటా జనవరి 30 వ తేదీన స్మరించుకుంటూ
నివాళులు అర్పిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి లు మాట్లాడుతూ…
మహాత్ముడి గొప్ప ఆలోచనలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు సమష్టిగా ప్రయత్నించాలన్నారు.
ఈరోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీరులకు నివాళులు అర్పించారు. వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతిసారీ స్మరించుకోవడంతో పాటు…. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు.
కార్యక్రమంలో డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, కలెక్టరేట్ విభాగాల పర్యవేక్షకులు శ్రీకాంత్, రమేష్ , EDM శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.