బలగం టివి ,, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజాయుద్ధనౌక గాయకుడు, మాటల తూటా విప్లవకారుడు గద్దర్ జయంతి వేడుకలో నాయకులు ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తోట ధర్మేందర్ మాట్లాడుతూ గద్దర్,అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు,తాను ప్రసిద్ధ భారతీయ జానపద గాయకుడు,కవి సినీ గేయ రచయిత,సామాజిక కార్యకర్త సామాజిక సమస్యలపై తన గళంతో బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించిన అధైర్యపడని విప్లవ ఆయుధమని పేర్కొన్నారు.అట్టడుగున ఉన్నవారి హక్కుల కోసం ఆలోచనాత్మకమైన పాటలతో తన సమయాన్ని, జీవితాన్ని పీడిత ప్రజల కొరకే అంకితం చేశారని వెల్లడించారు.గద్దర్ అణగారిన ప్రజల గొంతుకై సామాజిక మార్పును తీసుకురావడానికి భారతదేశంలోని వివిధ సామాజిక,ఆర్థిక రాజకీయ సమస్యలపై అవగాహన పెంచడానికి అసమానతలు లేని సమాజం కొరకు తన కళను ఉపయోగించారని తెలిపారు.తన మాట తన పాటతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దీటి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.