- ఇల్లంతకుంట లో కరపత్రాల ఆవిష్కరణ
బలగం టీవీ, ఇల్లంతకుంట:
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహా ధర్నా కరపత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు వీరాహత్ అలీ, జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ ల పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు మారుపాక అనిల్ కుమార్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించాలని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని,వృత్తి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ 3న హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు జరగనున్న మహా ధర్నాకు రాష్ట్ర, జాతీయ, జిల్లా, మండల నాయకులు తోడ్పడాలని, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రాకం సుమన్, ఏనుగుల మహేందర్, కొయ్యడ రాజయ్య, కముటం పర్శరాం, కందారం ఆంజనేయులు, గుండ రవిందర్, బండారి శ్రీనివాస్,కాసుపాక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
