టీవీ9 ఎడిటర్ రజినీకాంత్ తండ్రి మృ*తి: ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

0
68

బలగం టీవీ, హైదరాబాద్‍:

టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజినీకాంత్ తండ్రి వెల్లలచెరువు సాంబశివ రావు మరణించారని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ – డీవోటీ పెన్షనర్స్ అసోసియేషన్ (AIBDPA) ఆంధ్రప్రదేశ్ శాఖ ఉపాధ్యక్షుడిగా సాంబశివరావు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.

సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని, తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here